
రజాక్ మృతదేహం
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లెకు చెందిన ఎండీ. రజాక్(52) ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి గురువారం మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. రజాక్ ఇంటి సమీపంలోని చింతచెట్టకు ఉన్న చింతకాయను చెట్టు ఎక్కి తెంపుతుండగా కాలుజారి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కాగా వరంగల్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.