నగరాన్ని నంజుకుంటున్న నల్లజాతీయులు | Nigerian Gang Arrested in Hyderabad While Smuggling Drugs | Sakshi
Sakshi News home page

నగరాన్ని నంజుకుంటున్న నల్లజాతీయులు

Published Tue, Jun 25 2019 8:50 AM | Last Updated on Tue, Jun 25 2019 9:45 AM

Nigerian Gang Arrested in Hyderabad While Smuggling Drugs - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగర వాసులకు ఒకప్పుడు ఇక్కడి వారితో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన నేరగాళ్ల బెడద మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు విదేశీయులతో కొత్త భయం పట్టుకుంది. నేరాలు, మోసాలకు తోడు ఏకంగా మాదకద్రవ్యాల విక్రయాలు సైతం ప్రారంభించడమే అందుకు కారణం. సోమవారం 254 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరంతా నైజీరియా నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న వారే కావడం గమనార్హం. ఆఫ్రికా దేశాల నుంచి పలువురు మన దేశానికి వస్తున్నారు. వీళ్లలో ఆఫ్రికా, నైజీరియా, ఇథియోపియా, ఉగాండా దేశాల వారే ఎక్కువ. వీరంతా హైదరాబాద్‌తో పాటు ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి మహానగరాల్లో స్థిరపడుతున్నారు. వీరిలో కొందరు చదువు కోసం, మరి కొందరు బతుకుతెరువు కోసం వస్తున్నారు. ఇక్కడకు చదువు కోసం వచ్చే వారిలో చాలావుందికి మన దేశం, అమెరికా లాంటి సంపన్న దేశాలు ఉపకార వేతనాలను మంజూరు చేస్తున్నాయి.

ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న నల్లజాతీయులూ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు వీరు తమకు వచ్చే జీతాలు, ఉపకార వేతనాలతో హాయిగా బతికే వాళ్లు. కానీ ప్రస్తుతం సీను మారింది. ఇటీవల జాతీయంగా పెరిగిపోయిన విలాస సంస్కృతి ప్రభావం వీరిపై పడింది. దాంతో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. జల్సాలకు మరిగారు. చీకటి పడితే చాలు... పబ్‌లు, డిస్కోల్లో చిందులేస్తున్నారు. గడువు ముగిసినా ఇక్కడే తిష్ట విలాస జీవితం గడపటానికి అవసరమైన డబ్బుల కోసం కొందరు నల్లజాతీయులు పెడదారి పడుతున్నారు. మోసాలైతే తక్కువ శ్రమ, ఎక్కువ ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో వాటికే తెగబడుతున్నారు. తమకున్న సాంకేతిక పరి/ê్ఞనాన్ని వినియోగించుకుని సైబర్‌ నేరాలకు తెగబడుతున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాదు... ఢిల్లీ, ముంబైల్లో స్థిరపడిన నల్లజాతీయులకూ హైదరాబాదీయులు టార్గెట్‌గా మారుతున్నారు. ఇప్పుడు వీరు మరో అడుగు ముందుకు వేశారు. మహానగరాల్లో  డ్రగ్స్‌కు ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుంటూ పెడ్లర్స్‌గా మారుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీలర్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. వీసా గడువు ముగిసిపోయినా... డబ్బు సంపాదన, విలాసాలకు అలవాటుపడి నల్లజాతీయులు తమ వ్యాపకాలను కొనసాగిస్తూ అక్రమంగా ఇక్కడే నివసిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోని సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో నివసిస్తున్న విదేశీయులపై పక్కా నిఘా ఏర్పాటు చేయడానికి సన్నాహిలు ప్రారంభించారు.  

అరెస్ట్‌ అయింది వీరే..
నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాల ముఠా కేసు లో సూడాన్‌ జాతీయులు సబ్రీ, మొమెమ్‌ ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.   
షిల్లాంగ్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నగరానికి చెందినయువతి నుంచి రూ. 9 లక్షలు వసూలు చేసి మోసం చేసిన జాన్సన్, విలియంపై గోపాలపురం ఠాణాలో కేసు నమోదైంది.    
నకిలీ పాస్‌పోర్టులు తయారు చేస్తున్న సులేవూన్‌ అబ్దుల్‌ను టాస్క్‌ఫోర్స్‌ పట్టుకుంది.   
దక్షిణాఫ్రికాకు చెందిన ఫిలిప్‌ హెన్రీ, నైజీరి యాకు చెందిన అక్మలాఫే సావుయుల్‌ అల్బా నకిలీ డాలర్లు తయారు చేస్తూ పట్టుబడ్డారు.   
వీసా గడువు ముగిసినా నగరంలోనే ఉంటున్న ఇథియోపియన్లు ఒవుర్‌ ఇబ్రహీం, వుహవ్ముద్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు  అరెస్టు చేశారు.      
లిబియాకు చెందిన కాస్మో రేవూండ్‌ సోవూజిగూడలో సాయి శంకర్‌ను మోసం చేయబోయి దొరికిపోయాడు. అదను చూసి కాస్మో ఏకంగా పంజగుట్ట ఠాణా నుంచే పరారయ్యాడు.
కోట్ల రూపాయల లాటరీ తగిలిందంటూ ఎస్‌ఎమ్మెస్‌తో ఎరవేసి... రూ.లక్షలు స్వాహా చేసిన నైజీరియన్‌ నేరగాడు శామ్యుల్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్టర్‌ను ఫోన్‌లో సంప్రదించి... రూ. 50 కోట్లు పెట్టుబడిపెడతామంటూ ఎరవేసి రూ.98 లక్షలు స్వాహా చేసిన నైజీరియన్‌ ఒజోబిలీ హెన్రీ ఓనేకి సీసీఎస్‌ సైబర్‌ సెల్‌ అధికారులు కటకటాల్లోకి నెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement