
విజయవాడ : ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడే ముఠాను గురువారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పటమట ఏరియాలోని కరెన్సీనగర్‌లో కమల రెసిడెన్సీ అపార్టుమెంట్‌లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కాస్తున్న 12మందిని టాస్క్‌ఫోర్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. బెట్టింగ్‌కు నాయకత్వం వíßహిస్తున్న కె. చంద్రమోహన్‌తో పాటు 11మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 15 సెల్‌ఫోన్‌లు, కలర్ టీవీ సీజ్ చేశారు. పందెం దారులు యాప్ ద్వారా బెట్టింగులు కాస్తున్నారు. విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ పి. మురళీధర్, ఆర్. సురేష్‌రెడ్డి, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.