
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
సాక్షి, అల్లిపురం(విశా ఖ దక్షిణ) : తిరుపతి – విశాఖ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బాత్రూమ్‌లో గుర్తు తెలి యని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు బుధవారం గుర్తించా రు. రైల్వే పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి–విశాఖ స్పెషల్ ఎక్స్‌ప్రెస్(08574)లోని బాత్రూమ్‌లో సుమా రు 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఉరి వేసుకున్నట్లు ఉదయం 10గంటల సమయంలో ఫిర్యాదు అందింది. దీంతో ఆర్పీఎఫ్ ఎస్ ఐ ఎల్.రమణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను 0891–2746211, 94402252 77, 9440627547 సంప్రదించాలని కోరారు.