
గాయపడిన అరుదైన పెలికాన్ పక్షి
వనపర్తి: రష్యాలోని సైబీరియాకు చెందిన అరుదైన పెలికాన్(నేల పట్టు) పక్షి పెద్దమందడి మండలం జంగమాయపల్లిలోని ఈర్లచెరువుకు వచ్చింది. దారితప్పి వచ్చిన ఈ పక్షి చెరువులోని చేపలను తినడాన్ని గ్రామస్తులు గమనించారు. ఏటా చలికాలంలో సైబీరియా నుంచి కొల్లేరు సరస్సుకు కొన్ని అరుదైన పక్షులు వస్తుంటాయి. అందులో భాగంగానే ఇది వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. వేటగాడు అమర్చిన ఉచ్చులో పడి విలవిల్లాడింది. మంగళవారం స్థానికులు శివరాజు, బుచ్చన్న, దాసు బయటికి తీసి వైద్యం చేయించారు. చివరికి ఫారెస్ట్ రేంజర్ అధికారి రవీందర్‌రెడ్డికి అప్పగించారు.