
ప్రతీకాత్మక చిత్రం
వైఎస్సార్ జిల్లా : సిద్ధవటం మండలం లంకమల్ల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా తమిళ కూలీల రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు ఫారెస్ట్ సిబ్బంది గాయపడ్డారు. దీంతో సిబ్బంది హెచ్చరికలు చేసి గాలిలోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒకరిని అరెస్ట్ చేశారు. ఆరుగురు పరారయ్యారు. ఏడు ఎర్రచందనం దుంగలు, నాలుగు గొడ్డళ్లు, మూడు రంపపు బ్లేడు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన తమిళ స్మగ్లర్‌ను మీడియా ఎదుట హాజరు పరచి స్థానిక డీఎస్పీ శివప్రసాద్ వివరాలు వెల్లడించారు.