వివాహితపై సామూహిక అత్యాచారం | Two Man Molested 25 Years Married Woman In Mumbai | Sakshi
Sakshi News home page

వివాహితపై సామూహిక అత్యాచారం

Published Tue, Sep 17 2019 8:50 PM | Last Updated on Tue, Sep 17 2019 11:26 PM

Two Man Molested 25 Years Married Woman In Mumbai - Sakshi

ముంబై :  ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు సామూహిక ఆత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది. బాధితురాలి అత్యంత సన్నిహితుడే ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. మరో వ్యక్తితో కలిసి తనపై అత్యాచారానికి తెగబడినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని సతరకు చెందిన 25 ఏళ్ల మహిళ గత ఏడాది భర్త నుంచి విడాకులు తీసుకుని కూతురితో కలిసి నివాసముంటోంది. అయితే అప్పుడప్పుడు సోదరిని కలవాడనికి ముంబైలోని ఆమె ఇంటికి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో తన సోదరి ఇంటి పక్కన నివాసముండే అంజద్‌ ఆలీ(30)తో పరిచయం ఏర్పడింది. ఆమె ముంబై వెళ్లిన ప్రతీసారి అతడిని కలిసేదని వారిద్దరు కలిసి షికార్లకు వెళ్లేవారు. దీంతో వారిద్దరి మధ్య చనువు పెరగడంతో ఆలీ మహిళ న్యూడ్‌ ఫోటోలను పంపమని అడగగా దానికి ఆమె ఆంగీకరించింది.

అప్పటి నుంచి అతడు ఆమెను ఎప్పుడుపడితే అప్పుడు కలవమని వేధంచడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ మహిళ అతడు చెప్పిన చోటుకు వెళ్లింది. దీంతో ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం తన స్నేహితుడు నూర్‌ షేక్‌తో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన ఘటనను తన సోదరికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement