భోపాల్ : మైనర్ బాలికపై భర్త చేయబోయిన అఘాయిత్యాన్ని ఓ వివాహిత అడ్డుకున్నారు. భర్త వికృత చేష్టలను అడ్డుకున్న ఆమె గట్టిగా అరవడంతో అతడు అక్కడినుండి పరారయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘట్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ పార్తేటి కథనం ప్రకారం.. సాకు నీతమ్(25)కు కొంతకాలం కిందట వివాహమైంది. వీరు బాలాఘట్ జిల్లా బిర్సా ఏరియాలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం వీరి ఇంటికి ఓ 10 ఏళ్ల చిన్నారి వచ్చింది. భార్య ఇంట్లో లేదని గమనించిన భర్త ఆ బాలికపై అత్యాచారం చేయాలని యత్నించాడు. బలవంతంగా బాలిక దుస్తులు విప్పేసి అతడు మృగాడిగా మారిన సమయంలోనే నిందితుడి భార్య ఇంటికి చేరుకున్నారు. చిన్నారిపై జరగబోయే దారుణాన్ని అడ్డుకుని, గట్టిగా కేకలు వేయడంతో తన భర్త పరారయ్యాడని పోలీసులకు ఆమె తెలిపారు.
బాలిక తల్లిదండ్రులు నిందితుడు నీతమ్‌పై ఫిర్యాదు చేశారు. మైనర్‌పై హత్యాచారయత్నం, పోక్సో చట్టాల ప్రకారం పలు సెక్షన్లలో నీతమ్‌పై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. నిందితుడు నీతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం తమ బృందం గాలింపు చర్యలు చేపట్టిందని వివరించారు. దగ్గిరి బంధువైన ఓ వ్యక్తి కూతురిపై అఘాయిత్యం చేయబోయిన నీతమ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment