మంచినీటి కోసం ఆందోళన | agitation for drinking water | Sakshi
Sakshi News home page

మంచినీటి కోసం ఆందోళన

Published Tue, Aug 9 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

రోడ్డుపై బైఠాయించిన మహిళలు, స్థానికులు

రోడ్డుపై బైఠాయించిన మహిళలు, స్థానికులు

  • న్యాల్‌కల్‌ బస్‌స్టాండ్‌ వద్ద మహిళల బైఠాయింపు
  • న్యాల్‌కల్‌: నెలరోజులుగా మంచినీటి సమస్యను పరిష్కరించాలని నాయకులు, అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన న్యాల్‌కల్‌ మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం  ఖాళీబిందెలతో  న్యాల్‌కల్‌ ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకున్న బీసీ కాలనీ మహిళలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీసీ కాలనీల్లో తాగునీరు లేకపోవడంతో బోర్ల వద్దకు వెళ్లి  తెచ్చుకుంటున్నామని, బోర్ల యజమానులు కొన్నిసార్లు  ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.  సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. గంట పాటు రోడ్డుపై ఆందోళన చేయడంతో నారాయణఖేడ్, జహీరాబాద్, బీదర్‌ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నాయకుల హామీతో ఆందోళన విరమించారు.

    న్యాల్‌కల్‌ రోడ్డుపై బైఠాయించిన బీసీ కాలనీ మహిళలు, స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement