అగ్నికి ఆహుతైన అరటితోట | garden vandalise of fire | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆహుతైన అరటితోట

Published Thu, Feb 23 2017 11:59 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

అగ్నికి ఆహుతైన అరటితోట - Sakshi

అగ్నికి ఆహుతైన అరటితోట

ఎన్ఎస్‌గేట్‌ (చెన్నేకొత్తపల్లి) : మండల పరిధిలోని నాగసముద్రం గేట్‌ సమీపంలో సాగు చేసిన అరటితోట గురువారం మధ్యా హ్నం అగ్నికి ఆహుతైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన రాజలక్ష్మి ఎ¯ŒSఎస్‌గేట్‌లో ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకుని అందులో మూడెకరాల్లో రెండేâýæ్ల క్రితం అరటిపంట సాగు చేసింది. ప్రస్తుతం అరటితోట రెండునెలల అరటిగెలల దశలో ఉంది. అయితే గురువారం మధ్యాహ్నం అరటితోట నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కన ఉన్న రైతులు అక్కడికి చేరుకుని విషయాన్ని యజమానికి తెలిపారు. వారు అక్కడికి చేరుకునేలోగా అరటితోటలో మంటలు వ్యాపించాయి.

వెంటనే ధర్మవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించి రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకునేలోగా తోటపూర్తిగా అగ్నికి కాలిపోయింది. బాధిత రైతు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రమాదంలో మూడెకరాల్లో సాగు చేసిన దాదాపు 4 వేల అరటి చెట్లు, డ్రిప్‌ పరికరాలు పూర్తిగా కాలిపోయాయన్నారు. దాదాపు రూ.3లక్షల నష్టం వాటిల్లిందన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విషయాన్ని హార్టీకల్చర్‌ ఎంపీఈఓ సబీహాకు సమాచారం అందించడంతో ఆమె కాలిపోయిన తోటను పరిశీలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement