జిల్లా అడవిని తలపించాలి
మొయినాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. శనివారం మొయినాబాద్ మండలంలో ఆమె హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలో విద్యార్థులు, మహిళలతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలునాటి జిల్లాను అడవిని తలపించేలా చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాతక్మంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి గ్రామానికి 40 వేల మొక్కల చొప్పున జిల్లాలో 2 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు.
విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, ప్రజలంతా హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతిఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, రోడ్లుపక్కన, ఖాలీస్థలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని మహిళా సమాఖ్య భవనం, రోడ్ల పక్కన ఆమె మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, ఏఎంసీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మొయినాబాద్ సర్పంచ్ జీనత్‌బేగం, చిలుకూరు సర్పంచ్ గున్నాల సంగీత, ఎంపీటీసీ సహదేవ్, ఎంపీడీఓ సుభాషిణి, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంఈఓ వెంకటయ్య, నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, రవుఫ్, కొండల్‌గౌడ్, శ్రీహరి, రమేష్, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.