జిల్లావ్యాప్తంగా వర్షం
-
అత్యధికంగా మహాముత్తారంలో 6.9 సెంటీమీటర్లు
-
సగటున 2సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
ముకరంపుర : జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సగటను 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మహాముత్తారంలో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా జూన్ నుంచి ఇప్పటివరకు 746.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 739.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. కాటారంలో 6.3, సుల్తానాబాద్ 2.7, ఓదెల 2.3, ఎలిగేడు 2.9, శ్రీరాంపూర్, ఇల్లంతకుంట 4, గంభీరావుపేట 5.4, ఎల్లారెడ్డిపేట 3.2,ముస్తాబాద్ 5, మల్లాపూర్ 2.7, ఇబ్రహీంపట్నం 2.8, చిగురుమామిడి 3.1, వీణవంక 3.6,చొప్పదండి 4.2, హుజూరాబాద్ 2.9, హుస్నాబాద్ 4.2, కోహెడ 3.2, ఎల్కతుర్తి 2.4, భీమదేవరపల్లి 2.3, కమలాపూర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మల్హర్, మహదేవపూర్, కమాన్‌పూర్, జూలపల్లి, బోయినపల్లి, చందుర్తి, సిరిసిల్ల, పెగడపల్లి, కొడిమ్యాల, రాయికల్, మెట్‌పల్లి, రామడుగు, కేశవపట్నం, గంగాధర, సైదాపూర్, బెజ్జంకి మండలాల్లో ఒకటి నుంచి 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది మండలాల్లో అధికం, 39 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయింది. కోనరావుపేట, పెగడపల్లి, కొడిమ్యాల, కథలాపూర్, మేడిపల్లి, గొల్లపల్లి, ధర్మపురి, రామడుగు, మహాముత్తారం, మంథని ముత్తారంలో లోటు వర్షపాతం రికార్డయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి, పత్తి, ఆరుతడి పంటలకు జీవం పోశాయి. అయితే పలు ప్రాంతాల్లో పొలాలు, చేన్లలో నీళ్లు నిలవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.