రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిన సందర్భంగా గురువారం విజయవాడ బెంజి సర్కిల్‌లో సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేయనున్నారు.
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయిన సందర్భంగా గురువారం విజయవాడ బెంజి సర్కిల్‌లో సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు దీక్ష సందర్భంగా జరిగే సభలో ప్రతిజ్ఞ చేయించడంతోపాటు అదే సమయంలో గ్రామాలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఒకేసారి ఈ ప్రతిజ్ఞ చేయించడానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఈనెలలో సింగపూర్ వెళ్లనున్నారు.
పెన్సిల్వేనియా మిల్క్ మిషన్‌తో ఒప్పందం
ఒంగోలు జాతి గిత్తలు, పుంగనూరు ఆవుల సంతతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన మిల్క్ మిషన్‌తో బుధవారం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలోని చింతలపూడి, నూజివీడు ప్రాంతాల్లో బొగ్గు ఎక్కడ నిక్షిప్తమై ఉందో అన్వేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్‌ఎంఈటీ)తో ఒప్పందం చేసుకుంది.