
కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక కోసం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వర్షం కారణంతో మంగళవారం పరీక్షలు రద్దయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ పరీక్షలు య«థావిధిగా కొనసాగాయి. ఐదో రోజు మొత్తం 1025 మందికిగాను 455 అభ్యర్థులు ఎంపికయ్యారు.