కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో షెడ్యూల్ కులాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ తెలిపారు. శుక్రవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె స్టేట్ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ కేవీ సత్యనారాయణ, ఎస్పీ పీహెడ్‌డీ రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, ఆర్డీఓలు, డీఎస్పీలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పౌరహక్కుల దినాన్ని నిర్వహించాలి
కడప అర్బన్ : జిల్లాలో ప్రతి నెల 30న జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో పౌర హక్కుల దినాన్ని నిర్వహించుకోవాలనే చట్టం ఉందని, తద్వారా పౌరులు సమాజంలో వారికున్న హెచ్చుతగ్గులను, అసమానతలను తొలగించుకోవడానికి వీలవుతుందని కమలమ్మ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సభా భవనంలో రాయలసీమ ఎస్సీ, ఎస్టీ మానవ హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌరహక్కుల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాయలసీమ ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు జేవీ రమణ, అంబేడ్కర్ మిషన్ కడప అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్‌కుమార్, దళిత నాయకుడు డి.జయచంద్ర, అమీన్‌పీరా, సైమన్, ఎల్వీ రమణ, జకరయ్య, సంగటి మనోహర్, స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర సభ్యులు జయచంద్ర, ఎస్సీ సంఘం సభ్యులు శిరోమణెమ్మ, కుమారి, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
Published Sat, Jul 16 2016 8:27 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM
Advertisement