గాజులమండ్యం షుగర్‌ ఫ్యాక్టరీ మూసివేసే కుట్ర | Sugar Factory employees strike | Sakshi
Sakshi News home page

గాజులమండ్యం షుగర్‌ ఫ్యాక్టరీ మూసివేసే కుట్ర

Published Thu, Aug 4 2016 7:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

గాజులమండ్యం ఎస్వీ షుగర్‌ కర్మాగారం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

గాజులమండ్యం ఎస్వీ షుగర్‌ కర్మాగారం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

రేణిగుంట:
గాజులమండ్యంలోని ఎస్వీ షుగర్‌ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసి మూతవేయడానికి యాజవూన్యం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ గురువారం ఫ్యాక్టరీ ఆవరణంలో కార్మికులు ధర్నాచేశారు. 100మంది ధర్నాలో పాల్గొని ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కార్మిక యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ గత 10నెలలుగా కర్మాగారంలో పనిచేస్తున్న 380వుంది రెగ్యులర్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని వాపోయారు. తావుు జీతాల నుంచి జవుచేసిన పీఎఫ్‌ మెుత్తాలను ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు తన సొంతానికి వాడుకున్నారని విమర్శించారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు రూ.1.5కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. మృతిచెందిన కుటుంబాలకు పైసా పరిహారం చెల్లించలేదని, వారికి కనీసం పింఛను కూడా చెల్లించకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 1.10లక్షల టన్నుల చెరుకు తీసుకునేందుకు రైతుల నుంచి ఒప్పందం కుదుర్చుకుని ఆప్కాబ్‌ వద్ద రూ.2కోట్లు రన్నింగ్‌ క్యాపిటల్‌గా రుణం తెచ్చిన యాజవూన్యం కేవలం 35వేల టన్నుల చెరుకు మాత్రమే ఉందని ప్రభుత్వానికి లేఖ రాసి ఉద్దేశపూర్వకంగానే క్రషింగ్‌ నిలిపివేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని వారు ప్రశ్నించారు. ప్రైవేటు చక్కెర కర్మాగారాలకు పరోక్షంగా సాయం చేస్తున్న ఎండీ వెంకటేశ్వరరావ#ను అరెస్టుచేసి సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని అన్నారు. గతంలో చిత్తూరు షుగర్‌ఫ్యాక్టరీకి ఎండీగా పనిచేసిన వెంకటేశ్వరరావ# అక్కడ కర్మాగారాన్ని వుూసేసి రైతుల ఉసురుపోసుకున్నారని వివుర్శించారు. కార్మికుల డివూండ్లను పరిష్కరించకుంటే ఉద్యవూన్ని వురింత ఉధృతం చేస్తామన్నారు.

Advertisement
Advertisement