ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
రాష్ట్ర అటవీ శాఖలో.. మొత్తం నాలుగు కేటగిరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అవి..
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ)
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ)
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ)
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ఏబీఓ)
ఈ పోస్టులను 2013-14, 2014-15, 2015-16 సంవత్సరాల్లో భర్తీ చేస్తారు. వివరాలు..
పోస్టు - 2013-14 - 14-15 -15-16 మొత్తం
ఎఫ్‌ఆర్‌ఓ - 40 - 40 - 40 - 120
ఎఫ్‌ఎస్‌ఓ - 200 - 200 - 200 - 600
ఎఫ్‌బీఓ - 534 - 533 - 533 - 1600
ఏబీఓ - 500 - 500 - 500 - 1500
మొత్తం - 1274 - 1273 - 1273 - 3820
ఈ కేటగిరీ పోస్టులను జోనల్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
పేస్కేల్: రూ 15,280-40,510
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్/బోటనీ/కెమిస్ట్రీ/కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ఫారెస్ట్రీ/జియాలజీ/హార్టికల్చర్/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్/వెటర్నరీ సైన్స్/జువాలజీ) లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ (అగ్రికల్చర్/కెమికల్/సివిల్/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్).
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు
శారీరక ప్రమాణాలు: పురుషులు ఎత్తు: 163 సెం.మీ., ఛాతీ-79 సెం.మీ. గాలి పీల్చినప్పుడు ఛాతీ చుట్టుకొలత 84 సెం.మీ. ఉండాలి. మహిళలు ఎత్తు: 150 సెం.మీ.
ఎంపిక ఇలా:
ఎంపిక విధానంలో మూడు దశలు ఉంటాయి. అవి..రాత పరీక్ష, వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
రాత పరీక్ష:
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. అవి..జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఆప్షనల్ పేపర్. ఈ నాలుగు పేపర్లకు కలిపి 600 మార్కులు కేటాయించారు. వివరాలు..
పేపర్ మార్కులు సమయం
జీఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ - 150 - 150 ని.
జనరల్ ఇంగ్లిష్- 100 - 100 ని.
మ్యాథమెటిక్స్ - 150 - 150 ని.
ఆప్షనల్ సబ్జెక్ట్ - 200 - 180 ని.
మొత్తం - 600
విభాగాల వారీగా:
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ: ఒక రకంగా చెప్పాలంటే ఈ పేపర్ గ్రూప్-1,2 సర్వీసులకు నిర్వహించే జీఎస్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మెంటల్ ఎబిలిటీ, అన్ని విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ సైన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రస్తుత పరిణామాలు, క్షిపణులు,అంతరిక్ష ప్రయోగాలు, మానవ శరీర ధర్మశాస్త్రం, వ్యాధులు, వృక్ష, జంతు జాతులు వంటి వాటిని క్షుణ్నంగా అభ్యసించాలి. సోషల్ స్టడీస్‌లో భారతదేశ చరిత్ర, రాజవంశాలు-పాలనాకాలం-నాటి సాంఘిక, మత, సాంస్కృతిక పరిస్థితులు, కళలు, చరిత్ర ముఖ్య సంఘటనలను గుర్తుంచుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయోద్యమం తీరుతెన్నులను తెలుసుకోవాలి. భూగోళ శాస్త్రంలో ముఖ్యమైన దేశాలు, సరిహద్దులు, సరస్సులు, పీఠభూములు, పర్వతాలు, ఎడారులు, జల సంధులు, అగ్ని పర్వతాలు, నదులు, సంబంధిత అంశాలను తెలుసుకోవాలి. పాలిటీలో భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కు లు, ఆదేశిక సూత్రాలు, పార్లమెంట్, రాజ్యాంగ సవరణ చట్టాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, స్థానిక స్వపరిపాలన, ఇతర సంస్థలు జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు, మహిళా కమిషన్, అల్ప సంఖ్యాక, వెనుకబడిన తరగతుల కమిషన్లు, జాతీయాభివృద్ధి మండలి వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
ఎకానమీలో గ్రామీణాభివృద్ధి, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, జాతీయాదాయం, జనాభా, వ్యవసాయం, సంబంధిత అంశాలపై ప్రశ్నలుంటాయి. మెంటల్ ఎబిలిటీలో మెరుగైన మార్కులు సాధించాలంటే రక్తసంబంధాలు, సీటింగ్ అరేంజ్‌మెంట్, అనాలజీ, దిక్కులు, కోడింగ్- డీకోడింగ్ అంశాలపై పట్టు సాధించాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఆపత్సమయ నిర్వహణ, భూకంపాలు, తుపానులు, సునామీలు, వరదలు, కరువు కారణాలు -ప్రభావాలు, నష్ట నివారణ చర్యలపై ప్రశ్నలుంటాయి.
జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగానికి సంబంధించి రీడింగ్ కాంప్రెహెన్షన్, యూసేజ్ అండ్ ఐడియం, వొక్యాబులరీ, పంక్చువేషన్, లాజికల్ రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో సులువుగానే ఉంటాయి. అంటే ఇంగ్లిష్ భాషపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం బేసిక్ గ్రామర్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సెంటెన్సెస్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి.
మ్యాథమెటిక్స్: ఇందులో అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జ్యామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పదో తరగతి స్థాయిలో వీటి క్లిష్టత ఉంటుంది. ఇందులో మెరుగైన మార్కులకు సంబంధిత సూత్రాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. సూత్రాలాధారంగా ప్రశ్నలను సాధించడానికి ప్రాధాన్యతనివ్వాలి. చాలా కీలకమైన విభాగం ఇది. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు.. మిగతా విభాగాల్లో మెరుగైన స్కోర్ చేసినప్పటికీ ఇందులో వెనుకబడి పోతుంటారు. కారణం చాలా మంది అభ్యర్థులు పదో తరగతి తర్వాత నాన్ మ్యాథ్స్ గ్రూప్‌లను ఎంచుకోవడమే. కాబట్టి సదరు అభ్యర్థులు వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ కోసం సమయం కేటాయించాలి. ప్రతి రోజూ ప్రిపరేషన్‌లో మిగతా సబ్జెక్ట్‌లతో సమాంతరంగా మ్యాథమెటిక్స్ కోసం కొంత సమయం తప్పకుండా కేటాయించాలి.
ఆప్షనల్ సబ్జెక్ట్: పరీక్షలో అత్యధిక వెయిటేజీ ఈ విభాగానికే కేటాయించారు. అంతేకాకుండా అభ్యర్థి ఆసక్తి మేరకు ఆప్షనల్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు స్కోర్ చేసేందుకు ప్రయత్నించాలి. ఇందులో అడిగే ప్రశ్నల క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేయడం మంచిది. లైఫ్ సెన్సైస్ అభ్యర్థులు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ సబ్జెక్టును ఎంచుకుని పరీక్ష రాస్తే అత్యధిక మార్కులు పొందొచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థులు వారి సబ్జెక్టులనే ఎంచుకుంటే మంచిది. ఈ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కుల కోసం ఎంసెట్/ఏఐఈఈఈ / ఐఐటీజేఈఈ మెటీరియల్‌ను, పీజీ ఎంట్రెన్స్‌ల మెటీరియల్‌ను చదివాలి. ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్ స్థాయిలో 65 శాతం, డిగ్రీ స్థాయిలో 35 శాతం ప్రశ్నలుండొచ్చు.
రిఫరెన్స్ బుక్స్:
ఎన్‌సీఈఆర్‌టీ ఆరు నుంచి 12వ తరగతి పుస్తకాలు (మ్యాథ్స్, సైన్స్, సోషల్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్)
ఇంగ్లిష్-రెన్ అండ్ మార్టిన్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-ఆర్‌ఎస్ అగర్వాల్
మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్-ఆర్‌ఎస్ అగర్వాల్
వాకింగ్ టెస్ట్:
ఇందులో పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మిహ ళా అభ్యర్థులు 16 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో చేరుకోవాలి. ఈ ఈవెంట్‌కు ఎటువంటి మార్కులు కేటాయించరు. కేవలం దీన్ని అర్హత పోటీగా మాత్రమే పరిగణిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామకం ఖరారు చేస్తారు.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
పేస్కేల్: రూ10,020-29,200
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (బోటనీ/ఫారెస్ట్రీ/హార్టికల్చర్/జువాలజీ/ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/జియాలజీ /అగ్రికల్చర్) లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ (అగ్రికల్చర్/కెమికల్/సివిల్/మెకానికల్).
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
అర్హత: ఇంటర్మీడియెట్/తత్సమానం.
పేస్కేల్: రూ.7,960-23,650
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
అర్హత: పదో తరగతి.
పేస్కేల్: రూ.7,520-22,430
వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు
శారీరక ప్రమాణాలు:
పురుషులు-ఎత్తు: 163 సెం.మీ; ఛాతీ-79 సెం.మీ. గాలి పీల్చినప్పుడు ఛాతీ చుట్టుకొలత 84 సెం.మీ. ఉండాలి. వుహిళలు ఎత్తు: 150 సెం.మీ.
వికేంద్రీకృత:
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్.. ఈ మూడు పోస్టులకు వికేంద్రీకృత విధానం(డివిజన్ల వారీగా)లో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
ఎంపిక విధానం:
ఈ మూడు పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఒకే రకంగా..పలు దశలతో కూడి ఉంటుంది. ఇందులో మొదటి దశ రాత పరీక్ష. ఇందులో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో వాకింగ్ టెస్ట్ ఉంటుంది.
రాత పరీక్ష ఇలా:
రాత పరీక్ష డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ కలయికగా ఉంటుంది. ఇం దులో...పేపర్-1, పేపర్-2, పేపర్-3 అనే మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-1ను డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. పేపర్-2, పేపర్-3 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వీటిని తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో రూపొందిస్తారు. వివరాలు
పేపర్ - మార్కులు - సమయం
పేపర్-1 ఎస్సే రైటింగ్ - 20 - 60 నిమిషాలు
పేపర్-2 జనరల్ నాలెడ్జ్ - 100 - 90 నిమిషాలు
పేపర్-3 మ్యాథమెటిక్స్ - 100 - 90 నిమిషాలు
పేపర్-1:
పూర్తిగా వ్యాసరచనకు సంబంధించిన పేపర్. ఇందులో రెండు లేదా వుూడు అంశాలు ఇస్తారు. వాటికి సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో విశ్లేషణాత్మక వ్యాసాన్ని రాయూలి. ఈ అంశాల ప్రాధాన్యత లేదా క్లిష్టత స్థారుు కూడా వుూడు కేడర్లకు వేర్వేరుగానే ఉంటుంది.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాత పరీక్షలో సాధారణంగా వ్యాస రచన, సవుకాలీన పరిణావూలు, అటవీ శాఖకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అంతేకాకుండా అభ్యర్థుల స్థానిక ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు, సమాచారంపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఎక్కువే. వీటితోపాటు జాతీయు, అంతర్జాతీయు ప్రభావం ఉన్న అంశాలు (ఉదాహరణ: చిన్న రాష్ట్రాలు, నక్సలిజం, తీవ్రవాదం, రూపాయి పతనం, జల వివాదాలు, అడవుల పరిరక్షణ)పై కూడా ప్రశ్నలు అడగొచ్చు. వ్యాసాన్ని విశ్లేషణాత్మకంగా, అన్ని అంశాలను ప్రస్తావిస్తూ రాయాల్సి ఉంటుంది.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాత పరీక్షలో ఇచ్చే వ్యాసరచన అంశాల స్థారుు.. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్‌తో పోల్చితే కొంచెం సులువుగానే ఉంటుంది. ఉదాహరణ- తాగు నీటి సమస్య, మద్యపాన నిషేధం వంటివి. ఇందులో ఇచ్చిన అంశాన్ని మరీ లోతుగా కాకుండా, అన్ని అంశాలను ప్రస్తావిస్తూ రాయాల్సి ఉంటుంది.
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అంశాలు వురింత సులువుగా ఉండొచ్చు (ఉదాహరణ: మీకు నచ్చిన పుస్తకం/ప్రదేశం గురించి రాయుండి వంటివి). ఒక రకంగా చెప్పాలంటే పదో తరగతిలో ఉండే వ్యాస రచన వంటి విభాగమని చెప్పొచ్చు.
పేపర్-2:
జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించింది. ఇందులోని ప్రశ్నల క్లిష్ట త ఆయా పోస్టులకు పేర్కొన్న అర్హతల మేరకు ఉంటుంది. ఈ పేపర్‌లో జనరల్ సైన్స్, చరిత్ర, పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే మానవ శరీర ధర్మశాస్త్రం, వృక్ష, జంతు జాతులు, భారతదేశ చరిత్ర, రాజవంశాలు, కళలు, జాతీయోద్యమం, దేశాలు, సరిహద్దులు, సరస్సులు, పీఠభూములు, పర్వతాలు, ఎడారులు, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పార్లమెంట్, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, స్థానిక స్వపరిపాలన, గ్రామీణాభివృద్ధి, ప్రణాళికలు, జాతీయాదాయం, జనాభా..ఇలా అన్ని అంశాలపై ప్రాథమిక అవగాహనను పెంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ప్రశ్నలు రావచ్చు. ఇందుకోసం పరీక్ష తేదీకి ఏడాది ముందు వరకు జరిగిన ముఖ్య పరిణామాలను తెలుసుకోవాలి.
పేపర్-3:
అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. ఇందులోని ప్రశ్నల క్లిష్టత పాఠశాల స్థాయిలో ఉం టుంది. ఇందుకోసం సంఖ్యలు-వాటి ధర్మాలు, క.సా.గు, గ.సా.భా,గుణకారం, భాగహారం,ప్రమేయాలు,సమితులు, త్రికోణమితి,రేఖాగణితం,బహుపదులు,శ్రేణులు, వ్యాపార గణితం వంటి అంశాలను ఎక్కువగా సాధన చేయాలి.
ప్రతి పేపర్‌లో కనీసం 35 శాతం మార్కులు, అన్ని పేపర్లలో కలిపి 40శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే తర్వాతి దశ వాకింగ్ టెస్ట్‌కు అనుమతినిస్తారు.
వాకింగ్ టెస్ట్:
రాత పరీక్షలో నిర్దేశించిన అర్హత సాధించిన అభ్యర్థులకు 1:2 (ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున) నిష్పత్తిలో వాకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల వ్యవధిలో, వుహిళా అభ్యర్థులు 16 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో పూర్తి చేయాలి. ఈ ఈవెంట్‌కు ఎటువంటి మార్కులు కేటాయించరు. కేవలం దీన్ని అర్హత పోటీగా మాత్రమే పరిగణిస్తారు.