కరెంట్ బిల్లు కట్ట లేదని స్టార్టర్లు ఎత్తుకెళ్లారు : బాబు పాలనలో కరెంట్ బిల్లులు కట్టలేదని రైతుల పొలాల్లోకి కరెంటోళ్లు వచ్చి స్టార్టర్లు ఎత్తుకెళ్లారు.
కరెంట్ బిల్లు కట్ట లేదని స్టార్టర్లు ఎత్తుకెళ్లారు : బాబు పాలనలో కరెంట్ బిల్లులు కట్టలేదని రైతుల పొలాల్లోకి కరెంటోళ్లు వచ్చి స్టార్టర్లు ఎత్తుకెళ్లారు. పంట లు ఎండి పోతాయని ఎంత బతిమాలినా కుదరదన్నారు. ఒక్కోసారి కరెంటోళ్లను చూసి పొలం గట్ల వద్ద దాక్కున్నాం. కరెంట్ బిల్లులు కట్టేం దుకు రూ.5 వడ్డీకి తెచ్చి కట్టి అప్పుల పాలయ్యాం.
తొమ్మిదేళ్ల బాబు పాలనలో నరకం చూపించారు. రైతులను పురుగుల ను చూసినట్లు చూశాడు. అధికారం కోసం రుణమాఫీ చేస్తా.. రైతుల కు ఉచిత కరెంట్ ఇస్తానం టున్న ఆయన మాటను ఎవరూ నమ్మడం లేదు.
- బసవనూరు వెంకటేశ్వర్లు, రైతు,
రామాపురం, చిట్టమూరు మండలం