న్యూఢిల్లీ: ఐదో విడత లోక్సభ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. గురువారం 12 రాష్ట్రాల్లో 121 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. చాలా రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో పోలిస్తే అత్యధిక పోలింగ్ నమోదు కావడం విశేషం. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు మినహా మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలు జరిగిన వాటిలో నందన్ నీలేకని, మేనకా గాంధీ, వీరప్ప మొయిలీ, జస్వంత్ సింగ్ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో 80.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మణిపూర్-74, ఒడిశా-70 శాతం చొప్పున పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్-54, ఛత్తీస్‌గఢ్-63, జమ్మూకాశ్మీర్-69, రాజస్థాన్-63, బీహార్-56, మహారాష్ట్ర-55, కర్ణాటక-68, మధ్యప్రదేశ్-54, జార్ఖండ్-62, ఉత్తరప్రదేశ్ 62 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.
ఐదో విడత లోక్సభ ఎన్నికల్లో భారీ పోలింగ్
Published Thu, Apr 17 2014 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM
Advertisement