కోదండరామ్
హైదరాబాద్: తాము ఏ రాజకీయ పార్టీల సమావేశాలలో పాల్గొనం అని తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. టీజేఏసీ సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ అంశాలపై ఈ నెల 18న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఉద్యమంలో పాల్గొన్న పలువురు నేతలు వివిధ రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తుండటంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేని సందిగ్ధంలో జెఏసి నేతలు ఉన్నారు. అందువల్ల ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు.