‘తోట’కు వెల్లువెత్తుతున్న మద్దతు
ఏలూరు (ఆర్‌ఆర్ పేట), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ సం ఘాల ప్రతినిధులు ఆయనను కలసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో ఎం.టెక్ చదువుతున్న పలువురు ఏలూరు విద్యార్థులు బుధవారం ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పేద విద్యార్థుల కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలు గతంలో మరెవరూ అమలు చేయలేదని వారు గుర్తు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాం గ్రెస్‌పార్టీ అభ్యర్థుల విజయానికి సైనికుల్లా పని చేయాలనే సంకల్పంతో తోట చంద్రశేఖర్‌కు మద్దతు తెలిపి ఆయన విజయం కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
నూర్‌బాషా సంఘం మద్దతు
రాష్ట్రంలో మైనార్టీలకు, ప్రధానంగా నూర్‌బాషా కులస్తులకు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరని అన్యా యం చేశారని నూర్‌బాషా సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డి.ఇమాం ఖాజీ, వర్కిం గ్ ప్రెసిడెంట్ పీర్ ముహ్మద్, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు షేక్ హాజీ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆధ్వర్యంలో సంఘ నాయకులు బుధవారం తోట చంద్రశేఖర్‌ను కలసి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది మే 15న గుంటూరులో తమ సంఘం రాష్ట్ర మహాసభలు జరిగాయని, వీటికి హాజరైన చంద్రబాబు ముస్లిం, మైనార్టీలకు 15సీట్లు ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఈ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే కేటాయించి తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో మైనార్టీలు అధికంగా ఉన్న స్థానాల్లో కూడా సీట్లు కేటాయించకపోవడం చంద్రబాబుకు తమపై ఉన్న వివక్షకు నిదర్శనంగా భావిస్తున్నామన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ముస్లింలకు ఎక్కువ స్థానాలు కేటాయించడంతో తాము ఆ పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నామన్నారు. తోట చంద్రశేఖర్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన నేతలు ఈ ఎన్నికల్లో ఆయన విజయానికి కృషి చేస్తామని, తమ సంఘీయులను ఈ విషయంలో చైతన్యం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ముస్లిం-మైనార్టీ, బీసీలకు వైఎస్ హయాంలోనే అన్నివిధాలా న్యాయం జరిగిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ముస్లిం-మైనార్టీలు, బీసీలకు గతంలో కన్నా మరింత మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తారని స్పష్టం చేశారు.