మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేసిన విషయాన్ని సాక్షి మీడియా ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
సాక్షి, హైదరాబాద్: మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేసిన విషయాన్ని సాక్షి మీడియా ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. వెంటనే ప్రసారాలు పునరుద్ధరింపజేయాలని కోరారు. శుక్రవారం తెలంగాణలోని సూర్యాపేటలో బీజేపీ వికాస్‌పర్వ్ సభకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయనకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన అమిత్‌షా.. సాక్షి మీడియా అంశాన్ని పరిశీలించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర నేతలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను బీజేపీ ఖండించింది. ఆ పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు శుక్రవారం ఢిల్లీలో ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రసారాలను నిలిపివేయడం సమంజసం కాదని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.