
పెంపుడు కుక్కతో సచివాలయానికి సీఎస్!
ఫొటోలు తీసిన మీడియాపై మండిపాటు
సాక్షి, హైదరాబాద్: రెండో శనివారం సచివాలయానికి సెలవు.. ఉన్నతాధికారులు హాలీడే మూడ్‌లో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మాత్రం ఉదయం 11.40 గంటలకు సచివాలయానికి వచ్చారు. ఆయనతో పాటు మరో కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ కారులో నుంచి ‘మరొకరు’ కూడా దిగారు. వీరంతా ఏదో ముఖ్యమైన పనిపై వచ్చారేమో అని అందరూ అనుకున్నారు.
వారంతా కలసి పైకి వెళ్తున్న సమయంలో కెమెరాలతో ఆ చిత్రాలను బంధిస్తున్న మీడియాపై సీఎస్ మండిపడ్డారు. అయితే ఆయన తన ఇంటి పని మనుషులతోపాటు పెంపుడు కుక్కను సచివాలయానికి తీసుకువచ్చారు. ఆ ఫొటోలు తీసేందుకు మీడియా ప్రయత్నిం చడంతోనే ఎస్పీ సింగ్ కోపంతో ఊగిపోయారు.