రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం (టీహెచ్‌సీఏఏ) ఎన్నికలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి.
అధ్యక్ష బరిలో రేసు మహేందర్‌రెడ్డి.. జెల్లి కనకయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం (టీహెచ్‌సీఏఏ) ఎన్నికలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి ముగియడంతో కొత్త కార్యవర్గ ఎన్నిక కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సంఘం అధ్యక్ష స్థానా నికి రేసు మహేందర్‌రెడ్డి, జెల్లి కనకయ్యలు పోటీపడుతున్నారు. ఉపాధ్యక్ష పదవికి సురేందర్‌రెడ్డి, మహ్మద్ ముంతాజ్ పాషా, జలగం సంపత్‌కుమార్, కార్యద ర్శుల పోస్టులకు ఏడుగురు బరిలో ఉన్నారు.
సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఈసీ మెంబర్ల పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు ప్రాంగణంలో ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు పోలింగ్ జరుగనుంది. దాదాపు 6 వేల మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు.