అటు..ఇటు.. | IAS, IPS officers separation process | Sakshi
Sakshi News home page

అటు..ఇటు..

Published Wed, Dec 31 2014 2:17 AM | Last Updated on Thu, Sep 27 2018 3:19 PM

అటు..ఇటు.. - Sakshi

అటు..ఇటు..

మార్పులకు ఐఏఎస్‌ల యత్నం
కొందరు అధికారుల ఢిల్లీ బాట
మరికొందరు మంగళవారమే రిలీవ్
బల్దియా కమిషనర్ సోమే్‌శ్ కుమార్ ఇక్కడే

 సాక్షి, సిటీబ్యూరో: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన ప్రక్రియ ముగియడం.. గ్రేటర్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న కొందరు సీనియర్ అధికారులకు ఏపీ క్యాడర్‌కు కేటాయించడంతో... చిట్టచివరి ప్రయత్నంగా కొంతమంది క్యాడర్ మార్పు కోసం ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరిలో కొందరు మంగళవారం ఢిల్లీ బాట పట్టినట్లు తెలిసింది. మరికొందరు అధికారులు మంగళవారం రిలీవై...  ఏపీలో విధి నిర్వహణకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

ఏపీ క్యాడర్‌కు కేటాయించినప్పటికీ జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలంగాణ లోనే విధులు నిర్వహించనున్నారు. హెచ్‌ఎండీఏలో ఔటర్‌రింగ్ రోడ్డు ప్రాజెక్టు డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శామ్యూల్ ఆనంద్ కుమార్‌ను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. ఆయన బుధ, గురువారాల్లో రిలీవయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనాను కూడా ఏపీ క్యాడర్‌కు కేటాయించారు.

జనవరి 2తేదీ వరకు సెలవులో ఉన్నందున ఆయన విధుల్లో చేరిన తరువాత తెలంగాణ  సర్కారు రిలీవ్ ఆర్డర్ ఇచ్చిన పక్షంలోనేఏపీకి వెళ్లే అవకాశాలున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఇక నగర చీఫ్ రేషనింగ్ అధికారి పద్మ కూడా ఏపీ క్యాడర్‌కు వెళ్లనున్నారు. రవాణా శాఖ కమిషనర్, జలమండలి

మేనేజింగ్ డెరైక్టర్‌గా సాక్షి, సిటీబ్యూరో: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన ప్రక్రియ ముగియడం.. గ్రేటర్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న కొందరు సీనియర్ అధికారులకు ఏపీ క్యాడర్‌కు కేటాయించడంతో... చిట్టచివరి ప్రయత్నంగా కొంతమంది క్యాడర్ మార్పు కోసం ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరిలో కొందరు మంగళవారం ఢిల్లీ బాట పట్టినట్లు తెలిసింది. మరికొందరు అధికారులు మంగళవారం రిలీవై...  ఏపీలో విధి నిర్వహణకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

ఏపీ క్యాడర్‌కు కేటాయించినప్పటికీ జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలంగాణ లోనే విధులు నిర్వహించనున్నారు. హెచ్‌ఎండీఏలో ఔటర్‌రింగ్ రోడ్డు ప్రాజెక్టు డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శామ్యూల్ ఆనంద్ కుమార్‌ను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. ఆయన బుధ, గురువారాల్లో రిలీవయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనాను కూడా ఏపీ క్యాడర్‌కు కేటాయించారు.

జనవరి 2తేదీ వరకు సెలవులో ఉన్నందున ఆయన విధుల్లో చేరిన తరువాత తెలంగాణ  సర్కారు రిలీవ్ ఆర్డర్ ఇచ్చిన పక్షంలోనేఏపీకి వెళ్లే అవకాశాలున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఇక నగర చీఫ్ రేషనింగ్ అధికారి పద్మ కూడా ఏపీ క్యాడర్‌కు వెళ్లనున్నారు. రవాణా శాఖ కమిషనర్, జలమండలి మేనేజింగ్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యలు నిర్వహిస్తున్న ఎం.జగదీశ్వర్‌ను తెలంగాణ  క్యాడర్‌కు కేటాయించడంతో ఆయన ఇక్కడే కొనసాగనున్నారు. ఆబ్కారీ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం కూడా తెలంగాణ  రాష్ట్రంలోనే విధులు నిర్వహించనున్నారు.
 
ఐపీఎస్‌ల ఏపీ బాట..
నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా కొనసాగుతున్న శివప్రసాద్ అనారోగ్య కారణాల వల్ల తెలంగాణలో పని చేస్తానని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయన తాత్కాలికంగా తెలంగాణ లోనే విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఏపీ క్యాడర్‌కు వె ళ్లనున్నారు. సీసీఎస్ డీసీపీ పాలరాజు కూడా ఏపీ క్యాడర్ వెళ్లేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement