వీడిన ఉదయ్కిరణ్ హత్యకేసు మిస్టరీ
హయత్నగర్ సమీపంలోని బాటసింగారంలో ఉదయ్ కిరణ్ అనే బాలుడిని కిడ్నాప్ చేసి, హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఉదయ్ కిరణ్ ఇంటికి సమీపంలోనే ఉండే నవీన్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. డబ్బు కోసమే అతడీ పనిచేసినట్లు తెలిసింది. కేసు వివరాలను డీసీపీ రవివర్మ మీడియాకు తెలిపారు. ఉదయ్ కిరణ్ను కిడ్నాప్ చేసిన నవీన్.. అతడిని దూరంగా ఉన్న ప్రాంతానికి మోటారుసైకిల్పై తీసుకెళ్లాడు. తీరా అక్కడ పరిస్థితి ఇబ్బందిగా మారడంతో బాలుడి పీక నులిమి చంపేసి, బండరాయి కట్టి మన్సూరాబాద్ చెరువులో పారేశాడు. పుస్తకాల బ్యాగును కూడా పారేశాడు.
బాబు ఐడెంటిటీ కార్డు అక్కడకు సమీపంలో కనిపిస్తే అనుమానిస్తారని దాన్ని వేరేచోట దాచాడు. చివరకు భయంతో సరూర్నగర్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. నవీన్తో పాటు అతడికి సహకరించిన ఉపేందర్, నర్సింహ, నవీన్కుమార్ అనే ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లలో నవీన్ కుమార్ మాజీ హోంగార్డు. మూడు నెలల పాటు అతడు హోంగార్డుగా పనిచేసినట్లు తెలిసింది. నలుగురిలో ఎవరికీ ఇంతకుముందు నేరచరిత్ర లేదని, తనకు సహకరించినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఇస్తానని మాట ఇచ్చాడని కూడా పోలీసులు తెలిపారు.