మార్సా.. మూనా..
ఈ ఫొటో చూసిన చాలామంది ఇదే డౌట్ పడ్డారట. న్యూయార్క్ నగరంలో నాటి ఉగ్రదాడిలో కుప్పకూలిన డబ్ల్యూటీసీ టవర్స్ స్థానంలో నిర్మించిన ఫ్రీడమ్ టవర్ పైకి బ్లడ్ రెడ్ మూన్(ఎర్ర రంగులో ఉండే చంద్రుడు) వచ్చినప్పుడు క్లిక్‌మనిపించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని చూసిన వాళ్లంతా వెనుక ఉన్నది చంద్రుడా లేదా అంగారకుడా అని అనుకున్నారట.
దీన్ని న్యూజెర్సీకి చెందిన మహిళా ఫొటోగ్రాఫర్ జెన్నిఫర్ ఇటీవల తీశారు. ఫ్రీడమ్ టవర్‌పై బ్లడ్‌రెడ్ మూన్ వచ్చే చిత్రాన్ని పర్‌ఫెక్ట్‌గా తీసేందుకు ఆమె రెండేళ్ల నుంచీ ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికి అది సాధ్యమైంది. చిత్రం చూశారుగా.. చించేసింది!