మరిన్ని డాక్యుమెంట్లు ప్రచురించబోం | Court restrains newspaper from publishing leaked Scorpene documents | Sakshi
Sakshi News home page

మరిన్ని డాక్యుమెంట్లు ప్రచురించబోం

Published Wed, Aug 31 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

మరిన్ని డాక్యుమెంట్లు ప్రచురించబోం

మరిన్ని డాక్యుమెంట్లు ప్రచురించబోం

స్కార్పిన్ సమాచారం లీక్‌పై ది ఆస్ట్రేలియన్
మెల్‌బోర్న్: కోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో భారత్‌కు చెందిన స్కార్పిన్ తరగతి జలాంతర్గాముల అత్యంత రహస్య సమాచారాన్ని ఇకపై తాము ప్రచురించబోమని ‘ది ఆస్ట్రేలియన్’ దినపత్రిక మంగళవారం స్పష్టం చేసింది. పత్రిక వెబ్‌సైట్‌లోని డాక్యుమెంట్లను వెంటనే తీసివేయాలని, పూర్తి సమాచారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్ సంస్థకు అందజేయాలని వేల్స్‌లోని సుప్రీం కోర్టు ‘ది ఆస్ట్రేలియన్’కు సోమవారం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఫ్రాన్స్ సంస్థ డీసీఎన్‌ఎస్ వేసిన అఫిడవిట్ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంటూ గురువారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది.

పత్రిక ఇలాంటి సమాచారాన్ని ప్రచురించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో తమ కంపెనీ పరువు, పేరు దెబ్బతినే అవకాశం ఉందని అఫిడవిట్‌లో డీసీఎన్‌ఎస్ పేర్కొంది. కాగా తమ వద్ద పెద్దమొత్తంలో డాక్యుమెంట్లు ఉన్నా అన్నింటిని ప్రచురించలేదని, ఇకపై ఎలాంటి సమాచారాన్ని ప్రచురించబోమని ఆస్ట్రేలియన్ పత్రిక అసోసియేట్ ఎడిటర్ కామెరాన్ స్టీవర్ట్ పేర్కొన్నారు. ఫ్రాన్స్ సహకారంతో భారత్ సుమారు రూ.24 వేల కోట్లతో ఆరు జలాంతర్గాములను నిర్మిస్తున్న విషయం విదితమే.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement