‘ద ఆస్ట్రేలియన్’పై చర్యలు తీసుకోండి | Scorpene leak: French defence firm DCNS moves Aussie court for injunction against 'The Australian' | Sakshi
Sakshi News home page

‘ద ఆస్ట్రేలియన్’పై చర్యలు తీసుకోండి

Published Mon, Aug 29 2016 11:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

Scorpene leak: French defence firm DCNS moves Aussie court for injunction against 'The Australian'

మెల్‌బోర్న్: భారత రక్షణ విభాగం కోసం అత్యంత అధునాతన జలాంతర్గాములను (స్కార్పిన్) రూపొందిస్తున్న ఫ్రాన్స్ రక్షణ సంస్థ డీసీఎన్‌ఎస్.. ఈ సబ్‌మెరైన్ వ్యవస్థ వివరాలను ప్రచురించిన ‘ద ఆస్ట్రేలియన్’ పత్రికపై చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా సుప్రీంకోర్టును కోరింది. వార్తా పత్రిక తన వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన వివరాలను తొలగించటంతోపాటు.. తన దగ్గరున్న అన్ని దస్తావేజులను తమకు అప్పగించాలని కోర్టును కోరింది.

సోమవారం నాడు ఈ సబ్‌మెరైన్‌లో ఆయుధ సంపత్తికి చెందిన వివరాలను ప్రచురిస్తామని ఆస్ట్రేలియన్ పత్రిక పేర్కొన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన డీసీఎన్‌ఎస్ సంస్థ హుటాహుటిన కోర్టును ఆశ్రయించింది. ఈ వివరాలు వెల్లడైతే.. సంస్థతోపాటు.. తమ వినియోగదారులకు సమస్యలు తలెత్తుతాయని కోర్టుకు తెలిపింది.

Advertisement
Advertisement