![బిల్లు కట్టకుండా 100మందికిపైగా ఒకేసారి..](/styles/webp/s3/article_images/2017/09/5/41488546670_625x300.jpg.webp?itok=2r5p8hTV)
బిల్లు కట్టకుండా 100మందికిపైగా ఒకేసారి..
మాడ్రిడ్(స్పెయిన్):
ఓ హోటల్‌లోకి ఒక్కసారిగా వందమందికి పైగా వ్యక్తులు వచ్చి ఇష్టం వచ్చింది తిని, తాగి, డ్యాన్సు చేశారు. ఆపై బిల్లు కట్టకుండా జారుకున్నారు. దీంతో షాకైన హోటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పెయిన్‌లో సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన వివరాలివీ... ఉత్తర స్పెయిన్‌లో బెంబిరేలోని కార్మెన్ రెస్టారెంట్‌లోకి 100 మందికి పైగా ఒకేసారి వచ్చారు. కావాల్సినవి ఆర్డరిచ్చి తెప్పించుకుని తిన్నారు. అంతా కలసి డ్యాన్సు చేశారు. సుమారు 2,100 అమెరికన్ డాలర్ల వరకు బిల్లు చేశారు.
ఆ తర్వాత ఎవరో పిలుస్తున్నట్లుగానే ఒక్కసారిగా అక్కడి నుంచి మూకుమ్మడిగా మాయమయ్యారు. దీంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ‘వారు ఒక్కరొక్కరుగా కాదు..ఒక్కసారిగా బయటకు జారుకున్నారు. ఆపటానికి ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయారు. వారంతా స్థానికులైతే కాదు’ అని హోటల్ సిబ్బంది పోలీసులకు చెప్పారు.