ఆ దేశ తొలి మహిళా రక్షణ మంత్రి మృతి
మ్యాడ్రిడ్: స్పెయిన్ తొలి మహిళా రక్షణ మంత్రి కార్మిచాకన్(42) హఠాన్మరణం చెందారు. సోషలిస్టు పార్టీకి చెందిన ఆమె గుండె సమస్య కారణంగా చనిపోయినట్లు పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2008లో రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆమె ఆ దేశానికి తొలి రక్షణశాఖ మంత్రి. ఆమె అధికారం చేపట్టినప్పటి నుంచి స్పెయిన్ సైనిక సంపత్తిని ఆధునీకరించడంలో కీలకంగా పనిచేశారు.
అంతేకాకుండా సోషలిస్టు పార్టీకి ఆమె వెన్నెముకగా నిలిచినట్లు పార్టీ పేర్కొంది. యువతిగా ఉన్నప్పటి నుంచే ఆమె సోషలిస్టు భావజాలం రక్షించేందని, కాలక్రమంలో ఆమె పార్టీలో కీలక వ్యక్తిగా మారారని వెల్లడించింది. రక్షణమంత్రిగా పనిచేయడానికి ముందు ఆమె హౌసింగ్, నేషనల్ మేకర్ మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు. ఆమెకు చిన్నతనం నుంచే హృదయ సంబంధమైన సమస్యలు వచ్చేవంట.