ఈ కాంతి అమోఘం.. The light was wonderful .. | Sakshi
Sakshi News home page

ఈ కాంతి అమోఘం..

Published Fri, Mar 14 2014 2:53 AM

ఈ కాంతి అమోఘం..

 లండన్: మన సూర్యుడితో పోలిస్తే 1,300 వందల రెట్లు పెద్దదైన పసుపు రంగు నక్షత్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘హెచ్‌ఆర్ 5171 ఏ’గా నామకరణం చేసిన ఈ నక్షత్రం ఇచ్చే వెలుతురు ఎంతో తెలుసా.. ఏకంగా సూర్యుడికి పది లక్షల రెట్లు..! ఇంతవరకూ గుర్తించిన అతిపెద్ద పది నక్షత్రాల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. భూమికి 12,000 కాంతి సంవత్సరాల దూరంలో సెంటారస్ నక్షత్ర సమూహంలో ఈ నక్షత్రం ఉంది. అంతేకాదు.. దీనికి ఓ జోడీ నక్షత్రం కూడా ఉంది.
 
  ఆ నక్షత్రం దీని చుట్టూ 1,300 రోజులకోసారి పరిభ్రమిస్తుంది. ఈ రెండు నక్షత్రాలు ఒకదానికొకటి దాదాపు తాకుతున్నట్లుగా ఉన్నాయని వాటిని గుర్తించిన బృందంలోని శాస్త్రవేత్త ఒలివర్ చెస్‌న్యూ చెప్పారు. సాధారణంగా పసుపు రంగు నక్షత్రాలు అతి పెద్దగా ఉండడం అరుదని తెలిపారు.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement