'నీరు నిప్పు పెనవేసుకుంటే..'
దుబాయ్: పాలు నీళ్లు కలుస్తాయి. పెట్రోల్ కిరోసిన్ కూడా కలుస్తుంది. కానీ నీరు నిప్పు కలిసుంటాయా? అలా జరగడం సాధ్యమేనా? రెండు కలిసి ఒకే మార్గంలో ఒకదానిని ఒకటి పెనవేసుకొని నిరంతర ప్రయాణం సాగించడం జరుగుతుందా? అంటే ఈ విషయం తెలిశాక జరుగుతుందని నమ్మాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇలాంటి సంఘటన చూసేందుకు ఇప్పుడు దుబాయ్లోని ప్రజలంతా మలేహా రహదారి వెంట పరుగులు తీస్తున్నారు.
ఆ మిరాకిల్ దృశ్యాన్ని చూసి కనులవిందు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో ఆ చిత్రాన్ని వీడియో తీస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందంటే.. మలేహా రహదారి పక్కనే ఉన్న ఓ ఏడారిలోని ఇసుక నుంచి నీళ్లు ధారగా వస్తుండగా దానితోపాటు అగ్ని కూడా పెనవేసుకొని వస్తోంది. అది కూడా సంక్రాంతి పండుగకు ముందు వేసుకునేంత భోగి మంటలంతటి స్థాయిలో వస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ట్రెండ్ అవుతోంది.