ఐదు కోట్లతో ఆస్పత్రి | 5 crore special hospital set for prabhas pooja hegde Radhe Shyam | Sakshi
Sakshi News home page

ఐదు కోట్లతో ఆస్పత్రి

Published Tue, Jun 23 2020 1:08 AM | Last Updated on Tue, Jun 23 2020 1:08 AM

5 crore special hospital set for prabhas pooja hegde Radhe Shyam - Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే

‘బాహుబలి, సాహో’ వంటి ప్యాన్‌ ఇండియా సినిమాల తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న 20వ చిత్రానికి ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ‘రాధే శ్యామ్‌’ టైటిల్‌ ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం. కరోనా లాక్‌డౌన్‌కి ముందు జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌కు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ షెడ్యూల్‌ను యూరప్‌లో చిత్రీకరించాల్సి ఉంది.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది వీలుపడదని భావించిన యూనిట్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఐదు కోట్ల ఖర్చుతో ఓ ఆస్పత్రి సెట్‌ని తీర్చిదిద్దారట. ఇందులో డాక్టర్ల గదులు, ఐసీయూ, ప్రత్యేక వార్డులు, సాధారణ వార్డులు ఉన్నాయట. ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ 1980 కాలపు బ్యాక్‌డ్రాప్‌లో ఈ హాస్పిటల్‌ను తీర్చిదిద్దారట. ఈ చిత్రంలో కథానాయిక పూజా హెగ్డే నర్స్‌ పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్, పూజల మధ్య వచ్చే సన్నివేశాల్ని తాజా షెడ్యూల్‌లో చిత్రీకరించున్నారట. సినిమాలో మేజర్‌ పార్ట్‌ అయిన ఆస్పత్రి సెట్‌లో దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరణ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement