వెంకటేశ్వర మూవీ ఫ్యాక్టరీపై కాలా రాజేష్ దర్శకత్వంలో కె.ప్రసాద్ రెడ్డి నటించి, నిర్మించిన చిత్రం ‘ఆ నిమిషం’. ‘‘ఇది ఎమోషనల్ హారర్ మూవీ. భ్రూణ హత్యలు, ఆడపిల్లలపై హింస వంటి అంశాలను ప్రస్తావించాం. ‘వంటగదిలోకి ఆడది కావాలి.. పడకగదిలోకి ఆడది కావాలి.. సమాజంలో పరపతికి ఆడది కావాలి.. కానీ నట్టింట్లోకి ఆడపిల్ల వస్తుందంటే ససేమిరా అంటాడు.. వీడు మగాడు.. మొగుడు.
వీడు లేకపోతే ఏంటి భయం. అందుకే కసితో కన్నాను.. మరింత కసితో పెంచాను నా కూతుర్ని’ వంటి డైలాగులున్నాయి’’ అన్నారు దర్శకుడు. ‘‘షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీజర్‌ను త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: కున్నీ గుడిపాటి, కెమెరా: యోగి ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment