
సాక్షి, సినిమా: డైరెక్టర్ సుకుమార్‌ను తాను మామూలుగా నస పెట్టలేదని స్టార్ యాంకర్, నటి అనసూయ తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విశాఖపట్నంలో నిర్వహించింది మూవీ యూనిట్. ఈ వేడుకలో పాల్గొని అనసూయ మాట్లాడారు. ముందుగా అందరికీ శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 'నా ధైర్యం సుకుమార్. మూవీ యూనిట్ రంగస్థలం కోసం ఎంతో కష్ట పడింది. సుకుమార్‌ను నేను మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. రామ్‌చరణ్ నా ఫెవరెట్ యాక్టర్. అయితే ఆయనతో అత్త అని పిలిపించుకోనని గొడవ (మారాం) చేశాను. చిట్టిబాబు (చరణ్)కు మాత్రమే నేను రంగమ్మత్తను (మూవీ పాత్ర).
ప్రస్తుత జనరేషన్ వాళ్లు 1980లో ఉన్నవాళ్ల పద్ధతులు, అలవాట్లు తెలుసుకోవాలంటే రంగస్థలం చూడాల్సిందే. మార్చి 30న మూవీ విడుదల కానున్న రంగస్థలాన్ని ఆదరించాలని' అనసూయ కోరారు. చివరగా యాంకర్ సుమ, అనసూయను ఆటపట్టించారు. మీరు రామ్‌చరణ్‌కు అక్కగా కాదు.. చెల్లెలిగా అయితే అభిమానులు నమ్ముతారని ఆ పాత్ర ఇస్తారా అని సుకుమార్‌ను మీరు అడిగారట నిజమేనా అని అనసూయను సుమ అడిగారు. అయ్యో.. సుకుమార్ సార్ ఏంటిది అంటూ అనసూయ అన్నారు. మీరు (అనసూయ) అనుకోలేదా, అయితే తాను అలా అనుకున్నానంటూ సుమ అనే సరికి అక్కడ నవ్వులే నవ్వులు.
Comments
Please login to add a commentAdd a comment