గౌతమ్ మీనన్ కోసం రాయబారం? | Director Gautham Menon for Actress Jyothika with Negotiations Surya | Sakshi
Sakshi News home page

గౌతమ్ మీనన్ కోసం రాయబారం?

Published Wed, Oct 28 2015 2:56 AM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

గౌతమ్ మీనన్ కోసం రాయబారం? - Sakshi

గౌతమ్ మీనన్ కోసం రాయబారం?

తమిళసినిమా : దర్శకుడు గౌతమ్ మీనన్ కోసం నటి జ్యోతిక తన భర్త సూర్యతో రాయబారం పంపడానికి పూనుకున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. సూర్య, గౌతమ్ మీనన్‌లది హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. వీరి కలయికలో తెరకెక్కిన కాక్కకాక్క చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. కథ వినకుండానే సూర్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరోసారి వారణం ఆయిరం చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరు ఇతర చిత్రాలతో బిజీ అయిపోయారు.

అలాంటిది ఆ మధ్య ఇద్దరు కలిసి ఒక చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. గౌతమ్ మీనన్ తయారు చేసిన కథ నచ్చలేదని సూర్య బహిరంగంగానే వెల్లడించి ఆ చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ తరుణలో అజిత్ ఎనన్నై అరిందాల్ చిత్రంతో గౌతమ్‌మీనన్‌కు అవకాశం ఇచ్చారు.

సూర్య అంజాన్, మాస్ చిత్రాలు చేశారు. ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడలేదు. మళ్లీ సూర్య, గౌతమ్‌మీనన్‌లను కలిపే బాధ్యతను నటి, సూర్య అర్ధాంగి జ్యోతిక తన భుజస్కంధాలపై వేసుకున్నట్లు సమాచారం. మళ్లీ సూర్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో చిత్రం రూపొందే అవకాశం లేకపోలేదు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement