జీరోకి బై బై | Heartfelt post from Anushka Sharma as she wraps Zero shoot | Sakshi
Sakshi News home page

జీరోకి బై బై

Published Fri, Jun 29 2018 12:25 AM | Last Updated on Fri, Jun 29 2018 12:25 AM

Heartfelt post from Anushka Sharma as she wraps Zero shoot - Sakshi

ఆనంద్‌ ఎల్‌. రాయ్, అనుష్క, షారుఖ్‌

‘జీరో’ టీమ్‌కి బై బై చెప్పారు అనుష్కాశర్మ. ‘తను వెడ్స్‌ మను’ ఫేమ్‌ ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘జీరో’. అనుష్కాశర్మ, కత్రినా కైఫ్‌ కథానాయికలు. ఈ సినిమాలో తన షూటింగ్‌ కంప్లీటైందని అనుష్కాశర్మ పేర్కొన్నారు. ‘‘షారుక్‌ అండ్‌ ఆనంద్‌ల క్రియేటివ్‌ చిత్రం ‘జీరో’. ఈ సినిమాలో పార్ట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్, షారుక్‌లకు ధన్యవాదాలు. కత్రినా కైఫ్‌ అమేజింగ్‌ యాక్ట్రస్‌’’ అని పేర్కొన్నారు అనుష్క. ఆల్రెడీ రిలీజ్‌ చేసిన టీజర్లకు మంచి స్పందన లభిస్తోంది. షారుక్‌ మరగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ గెస్ట్‌రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘జీరో’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement