స్వీయానుభవాలతో పుస్తకం | Kajal Agarwal turns into travel writer | Sakshi
Sakshi News home page

స్వీయానుభవాలతో పుస్తకం

Published Mon, Dec 1 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

స్వీయానుభవాలతో పుస్తకం

స్వీయానుభవాలతో పుస్తకం

 నటి కాజల్ అగర్వాల్ త్వరలో రచయిత్రి కానున్నారు. అవును! నిజమే... ఈ ముద్దుగుమ్మ ఓ పుస్తకం రాయనున్నారు. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత కాన్ ఇగ్లూడెన్ రచించిన తాజా నవలల అయిదు పుస్తకాల సిరీస్... తనలో పుస్తకం రాయాలనే జిజ్ఞాస పెంచిందని ఇటీవలే కాజల్ మీడియాకు తెలిపారు. ఆమె ఇంకా చెబుతూ -‘‘కాన్ ఇగ్లూడెన్ భావ వ్యక్తీకరణ అద్భుతం. ఈ సిరీస్ చదువుతున్నప్పుడే... నాకు పుస్తకం రాయాలనే ఆలోచన కలిగింది. సినీ నటిని కావడం వల్ల ప్రపంచ దేశాలన్నీ చుట్టొచ్చే అదృష్టం కలిగింది. దేశ విదేశాల్లో రకరకాల వ్యక్తులతో పరిచయాలు, అక్కడ జరిగిన పలు సంఘటనలు, స్వీయ అనుభవాలు వీటన్నింటినీ క్రోడీకరించి ఈ పుస్తకం రాస్తాను. నా గురించి తెలుసుకోవాలనుకునేవారికి నేను రాయనున్న పుస్తకం చదివితే చాలు. నేనేంటో తెలిసిపోతుంది’’ అని చెప్పారు కాజల్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement