స్త్రీకి పురుష లక్షణాలుంటే... | Laddu kulla boondi boondi new movie | Sakshi
Sakshi News home page

స్త్రీకి పురుష లక్షణాలుంటే...

Published Tue, Jul 29 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

స్త్రీకి పురుష లక్షణాలుంటే...

స్త్రీకి పురుష లక్షణాలుంటే...

లడ్డు కుళ్ల బూంది బూంది చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు చిత్ర దర్శకుడు జీన్స్. అంత కొత్తగా ఉండే అంశం ఏమిటన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ చిత్ర కాన్సెప్ట్ వినూత్నంగా ఉంటుందన్నారు. లడ్డు కుళ్ల బూంది బూంది (లడ్డులో బూంది) అంటే లడ్డు అనేది ప్రపంచం అయితే అందులో స్త్రీ, పురుషులు బూంది లాంటివారన్నారు. అలాంటి స్త్రీ, పురుషులు వారు వీరు - వీరు వారుగా మారితే ఎలాగుంటుందన్న చిన్న తమాషానే లడ్డు కుళ్ల బూంది బూంది చిత్రం అని చెప్పారు.
 
  స్త్రీ గుణగణాలు పురుషులకు, పురుషుల లక్షణాలు స్త్రీలకు సంక్రమిస్తే ఎలాగుంటుందన్నది వినోద భరితంగా తెరపై ఆవిష్కరిస్తున్నట్లు వివరించారు. ఒక వినూత్న ప్రయోగంగా చిత్రం ఉంటుందన్నారు. చిత్ర కథ సీరియస్‌గా సాగుతున్నా చూసే ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని ఇస్తుందన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. చిత్రంలో హీరోగా కిరణ్మయి (నటి) హీరోయిన్‌గా జీన్స్ (నటుడు) నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తలైవాసల్ విజయ్, మహానది శంకర్, ఆలై, మధుమిత నటిస్తుండగా విలన్‌గా దేవదర్శిని నటించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement