నవ్వుల దొంగాట | Manchu Lakshmi Dongata Releasing on 01-May-15 | Sakshi
Sakshi News home page

నవ్వుల దొంగాట

Published Sun, Apr 26 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

నవ్వుల దొంగాట

నవ్వుల దొంగాట

 ఎలాగైనా డ బ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. దొంగాట ఆడాలనుకున్న ఆ యువకులను ఈ అమ్మాయి నానా తిప్పలు పెడుతుంది. అనుకున్నది ఒకటి అయినదొకటి అన్నట్టుగా తయారైన వారి పరిస్థితి చూసి నవ్వుకోవాలనుకుంటే ‘దొంగాట’ చూడాల్సిందే. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకుడు.
 
  వచ్చే నెల 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ -‘‘9 మంది హీరోలు కనిపించిన ఓ పాట ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామనీ, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయనీ దర్శకుడు చెప్పారు. . ఈ చిత్రానికి సంగీతం: సత్యమహావీర్, రఘు కుంచె, సాయి కార్తీక్, ఎడిటర్: ఎస్.ఆర్ శేఖర్, సహనిర్మాత: గాంధీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement