ఓ మైగాడ్.. నేనూ పాండా లాంటిదాన్నే! | omg, iam a panda, tweets tamannaah bhatia | Sakshi
Sakshi News home page

ఓ మైగాడ్.. నేనూ పాండా లాంటిదాన్నే!

Published Wed, Oct 7 2015 6:20 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

ఓ మైగాడ్.. నేనూ పాండా లాంటిదాన్నే! - Sakshi

ఓ మైగాడ్.. నేనూ పాండా లాంటిదాన్నే!

పాండాలు తెలుసు కదూ.. చూసేందుకు ముద్దుముద్దుగా కనపడే ఇవి.. నిద్ర వచ్చిందంటే మాత్రం తాము ఎక్కడుంటే అక్కడే నిద్రపోతాయట. చెట్టు ఎక్కితే అక్కడ చెట్టు కొమ్మల మీదే నిద్రపోతాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న హీరోయిన్ తమన్నా.. ఈ ఫొటోను ట్వీట్ చేసింది. దాంతో పాటు, తాను కూడా పాండా లాంటిదాన్నేనని, ఎక్కడపడితే అక్కడే నిద్రపోతానని చెప్పింది.

దానికి మరో హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా స్పందించింది. తాను కూడా అలాంటి దాన్నేనేమోనని చెప్పడంతో.. తమన్నా 'సేమ్ పించ్' అంటూ మరో ట్వీట్ పెట్టింది. ప్రధానంగా విమానాల్లో ప్రయాణించేటప్పుడు, అలాగే షూటింగులో సెట్లలో ఉన్నప్పుడు రెండు ప్లాస్టిక్ కుర్చీలు కనపడితే చాలని, వాటిమీద కూర్చునే నిద్రపోతానని శ్రుతిహాసన్ చెప్పింది. ఈ ఇద్దరి సరదా సంభాషణ నెటిజన్లను ఆకర్షించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement