సందీప్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి | SS Rakjamouli Accepted Sandeep Reddy Vanga Challenge | Sakshi

సందీప్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి

Published Mon, Apr 20 2020 9:10 AM | Last Updated on Mon, Apr 20 2020 11:21 AM

SS Rakjamouli Accepted Sandeep Reddy Vanga Challenge - Sakshi

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకున్నడైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగ.. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి ఛాలెంజ్‌ విసిరారు. క్వారంటైన్‌ సమయంలో రాజమౌళి తన భార్యకు సాయం చేస్తూ.. ఇంటి పనుల్లో పాలుపంచుకోవాలని సవాల్‌ విసిరారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సందీప్‌ పోస్ట్‌ చేశారు. ‘మనిషి ఇంటి పనులను గొప్పగా చేయగలడు. నిజమైన వ్యక్తి ఇంటి భారాన్ని కేవలం మహిళలపై వేయాలని అనుకోడు. ముఖ్యంగా ఇలా పనిమనిషి రాలేని క్వారంటైన్‌ సమయంలో అస్సలు చేయనివ్వడు. దయచేసి ఇంటి పనుల్లో మహిళలకు సహాయం చేయండి. నిజమైన మనిషిగా జీవించండి. ఇంటి పనుల్లో భాగస్వామ్యం అయ్యి మిగతావాళ్లకు ఆదర్శంగా నిలవాలని ఎస్‌ఎస్‌ రాజమౌళి గారిని కోరుతున్నాను. అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి సందీప్‌ ఇంట్లో పనులు చేస్తున్న వీడియోను జత చేశారు. వంటింట్లో గిన్నెలు కడగటం, ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులను సందీప్‌ చేశారు.

ఇక సందీప్‌ ఛాలెంజ్‌పై స్పందించిన రాజమౌళి ఈ సవాలును స్వీకరించారు. ఈ రోజు(సోమవారం) వీడియోను పోస్ట్‌ చేస్తానని తెలిపారు. ‘ఛాలెంజ్‌ అంగీకరించాను సందీప్‌. ఇంట్లో పని భారాన్ని మనం పంచుకోవడం ముఖ్యం. నేను ఈ రోజు ఇంట్లో పని చేసే ఆ వీడియోను షేర్‌ చేస్తాను.’ అంటూ రీట్వీట్‌ చేశారు. కాగా ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి తోట పని, రామ్‌ చరణ్‌ తన భార్య ఉపాసన కోసం చెఫ్‌గా మారి వంటలు చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు ఇంట్లో వంటలు చేయడం, ఇంటిని శుభ్రపరచడం వంటి పనులతో కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు ఇక సందీప్‌ మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్‌ ద్వారా ఎంతమంది ఇంట్లో మహిళలకు సహాయం చేస్తరో వేచి చూడాలి. (‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మహేశ్‌తోనే.. జక్కన్న క్లారిటీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement