సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో విస్సుశ్రీ, ఈష్యా శెట్టి జంటగా చలపతి మల్లాది ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కుమారి దివ్య సమర్పణలో అల్లు రవి, కె.ఎ. నాయుడు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను సరిగ్గా తెరకెక్కిస్తే, మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ చిత్రం చేశాం. రిషిల్ సాయి స్వరపరచిన ఈ చిత్రం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని తెలిపారు.
సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో...
Published Sat, Sep 6 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement
Advertisement