న్యూఢిల్లీ: అత్యాచార ఘటనల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసు అధికారులకు బదులుగా జ్యుడీషియల్ మేజిస్ట్రేటే నేరుగా నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫలితంగా కేసు విచారణ త్వరితంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా నేతృత్వంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత బాధితురాలిని సాధ్యమైనంత త్వరగా సమీపంలోని మహిళా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లేదా మహిళా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వద్దకు తీసుకు వెళ్లాలని కేసు పరిశోధనాధికారులకు సూచించింది.
మేజిస్ట్రేటే.. ‘ఆమె’ వాంగ్మూలం నమోదు చేయాలి
Published Wed, Apr 30 2014 2:55 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement