న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల విషయంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పార్టీలు స్వీకరించే విరాళాల గరిష్ట మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.2 వేలకు తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గత వారం కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. తాము కోరినట్లు ఒక్కో వ్యక్తి నగదు రూపంలో పార్టీలకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని కేంద్రం రూ.2,000కు తగ్గించిందని లేఖలో తెలిపింది.
గుప్త విరాళాల విషయంలో రూ.2 వేలు పరిమితిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేసింది. రాజకీయ పార్టీలు గుప్త విరాళాలు అందుకోవడంపై రాజ్యాంగంలో నిషేధం లేదన్న ఈసీ.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29సీ మాత్రం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి విరాళాలను అందుకోవడాన్ని పరోక్షంగా నిషేధిస్తుందని తెలిపింది. గుప్తవిరాళాల కింద రూ.20 వేలు అందుకున్న అవకాశమున్న నేపథ్యంలో అది నగదు రూపంలో కూడా ఉండొచ్చనీ, దీని కారణంగా గరిష్టంగా రూ.2 వేల నగదు మాత్రమే ఇవ్వాలన్న నిబంధనకు తూట్లు పొడిచినట్లే అవుతుందని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment