అసెంబ్లీలో స్పీచ్‌.. ఫేస్‌బుక్‌లో లైవ్‌ | Speech in the Assembly .. Live on Facebook | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో స్పీచ్‌.. ఫేస్‌బుక్‌లో లైవ్‌

Published Tue, Feb 7 2017 2:13 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

అసెంబ్లీలో స్పీచ్‌.. ఫేస్‌బుక్‌లో లైవ్‌ - Sakshi

అసెంబ్లీలో స్పీచ్‌.. ఫేస్‌బుక్‌లో లైవ్‌

గువహటి: అసెంబ్లీలోని తన ప్రసంగాన్ని ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ప్రసారం చేసినందుకు అస్సాం ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే అమినుల్‌ ఇస్లామ్‌ను స్పీకర్‌ హితేంద్రనాథ్‌ గోస్వామి మూడు రోజులపాటు సస్పెండ్‌ చేశారు. సభ్యుడిని సస్పెండ్‌ చేయాలని ఎథిక్స్‌ కమిటీ సిఫార్సు చేసిందని, సిఫార్సును ఆమోదించి అమినుల్‌ను ఫిబ్రవరి 8 వరకు సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ సోమవారం పేర్కొన్నారు.

సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమినుల్‌ మాట్లాడుతూ.. సభలో సభ్యుల కార్యకలాపాలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ మొత్తం లైవ్‌లో ప్రసారం చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement