ముంబై: శివసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. తుది దశకు చేరుకుంటున్నాయన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి త్వరలో లాంఛనంగా ఓ ప్రకటన విడుదల చేస్తామన్నారు. ఆర్‌పీఐతో, స్వాభిమాన్ శేత్కీరీ సంఘటన్ పార్టీలతోనూ ఇదే అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
తాము కనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం నిర్ణయాలను సమీక్షిస్తామన్నారు. ఈ రెండు పార్టీల పాలనలో వ్యక్తిగత లబ్ధి కోసమే నిర్ణయాలు జరిగాయని, అవినీతి వాసన గుప్పుమంటోందని అన్నారు.
సీట్ల సర్దుబాటు చర్చలు సానుకూలం
Published Wed, Sep 10 2014 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement
Advertisement