సెయింట్ లూయిస్ : అమెరికాలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఈ సారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాన్సస్‌లోని నాట్స్ సభ్యులు ఒక రోజు పానీపూరి స్టాల్‌ను ఏర్పాటుచేసి దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని హిందూ దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది.
నాట్స్ సభ్యులు పానీపూరి స్టాల్ నిర్వహించడం ద్వారా 1500 డాలర్ల మొత్తం సమకూరగా.. వచ్చిన ఆ మొత్తాన్ని స్థానిక హిందూ దేవాలయ నిర్మాణానికి విరాళంగా అందించారు. క్యాన్సస్లో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంపై స్థానిక తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు నాట్స్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment