‘కాంగ్రెస్‌ నేతలు తిన్న సొమ్ము కక్కిస్తాం’ | KCR Slams Congress Party In Shadnagar Meeting | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ నేతలు తిన్న సొమ్ము కక్కిస్తాం’

Published Sun, Nov 25 2018 6:00 PM | Last Updated on Sun, Nov 25 2018 8:30 PM

KCR Slams Congress Party In Shadnagar Meeting - Sakshi

సాక్షి, షాద్‌నగర్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ పార్టీ నేతలు తిన్న సొమ్మును కక్కిస్తామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. ఆదివారం షాద్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ టికెట్లను భక్తచరణ్‌దాస్‌ రూ.3 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. రాహూల్‌ గాంధీ ఏపీకి ప్యాకేజీ ఇస్తామంటున్నారని, తెలంగాణకు ప్యాకేజీ ఇస్తామని ఎందుకు చెప్పటంలేదని ప్రశ్నించారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..‘‘ కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ ఉంటే వార్త.. ఇప్పుడు పోతే వార్త.

సోనియా గాంధీ ఎందుకు బాధపడుతోందో అర్థం కావటం లేదు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.వెయ్యి పెన్షన్‌ ఇస్తున్నారా?. చంద్రబాబు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టాడంట.. మరి అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు కట్టలేదు?. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌కు సత్తాలేదు. చంద్రబాబును భుజాల మీద మోస్తున్నారు. మనకు వలసదారుల పెత్తనం అవసరమా.  24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మా పరిపాలనలో అవినీతి, భూకబ్జాలు, లంచాలు లేవు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement